Student Died: చిత్తూరు పూతలపట్టు మండలం నయనంపల్లి వద్ద విషాదం చోటుచేసుకుంది. నీవా నదిలో ఈతకు దిగి విజయ్ (19) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. విజయ్ ఆర్‌వీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. మొత్తం నలుగురు స్నేహితులు కలిసి ఈతకు వెళ్లారు. వీరిలో విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి స్వస్థలం కడప జిల్లా రాజంపేటగా పోలీసులు గుర్తించారు.
Student Died: నదిలో ఈతకు దిగి.. బీటెక్ విద్యార్థి మృతి! - ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
Student Died: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన బీటెక్ విద్యార్థి.. ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు పూతలపట్టు మండలం నయనంపల్లి వద్ద చోటుచేసుకుంది. మృతుడు ఆర్‌వీఎస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విజయ్‌గా గుర్తించారు.

నదిలో ఈతకు దిగి బీటెక్ విద్యార్థి మృతి