చిత్తూరు జిల్లా గంగవరం మండలం జాతీయ రహదారి పక్కనే గల క్యాటిల్ ఫారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల నిర్వాహకులు.. గుడ్లు ఇస్తామని కబురు పంపడంతో కొంతమంది విద్యార్థులు బడికి వచ్చారు. గుడ్లు తీసుకునేందుకు బడికి వచ్చిన ఐదో తరగతి విద్యార్థి లిఖితేశ్వర్ మెట్లమీద జారుతుంటే గోడ కూలటంతో.. ప్రాణాలు కోల్పోయాడు.
గోడ కూలి ఐదో తరగతి విద్యార్థి మృతి - gangavaram latest news
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని క్యాటిల్ ఫారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విషాదం నెలకొంది. గోడ కూలీ ఐదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఉన్న కోడిగుడ్లు పంచేందుకు పిల్లలను పిలిచినప్పుడు ఈ ఘటన జరిగిందని పాఠశాల నిర్వహకులు తెలిపారు.
గోడ కూలి ఐదో తరగతి విద్యార్థి మృతి
ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఉన్న కోడిగుడ్లు పంచేందుకే పిల్లలను రమ్మన్నట్లు పాఠశాల నిర్వాహకులు చెబుతుండగా... పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే గోడకూలి తమ కుమారుడు మృతి చెందాడు అంటూ బాలుడి తల్లి గంగవరం పోలీసులను ఆశ్రయించారు.
ఇదీ చదవండి