కలియుగ వైకుంఠనాధుడు తిరుమల శ్రీనివాసుడు భక్తులకు పున:దర్శనమిచ్చే శుభఘడియలు దగ్గరవుతున్న వేళ అధికారులు భద్రతను పటిష్ఠం చేశారు. తిరుపతి అర్బన్ పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా కృషి చేస్తూ పరిమిత స్థాయిలో భక్తులు స్వామి వారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. కొవిడ్ ప్రోటో కాల్ ను తప్పక పాటిస్తూ దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులనే కొండపైకి అనుమతిస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా ఘాట్ రోడ్‌పై అటవీ జంతువులు తిరుగుతున్న నేపథ్యంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'దర్శనం టిక్కెట్లు ఉన్నవారినే కొండపైకి అనుమతిస్తాం' - ttd darshan arragements in tirumala
సుమారు 80 రోజులుగా భక్తులకు దూరంగా ఏకాంతంగా పూజలందుకున్న కలియుగ వైకుంఠనాథుడు ఇవాళ్టి నుంచి దర్శనభాగ్యం ప్రసాదించనున్నాడు. కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తూ దర్శనం టికెట్లు ఉన్న భక్తులనే కొండపైకి అనుమతించేలా తితిదే ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
తిరుమలలో భద్రత పటిష్టం....