చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శునకాలు వీరంగం సృష్టిస్తున్నాయి. భవానీనగర్లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు గాయపడ్డాడు. కుక్కలు రోడ్ల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ అందరినీ భయపెడుతూ మీదికి ఎగబడుతున్నాయి. ఇళ్లలోకి సైతం చొరబడుతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఒక్కో కాలనీలో 15 నుంచి 25 వరకు..
ప్రధాన రోడ్లతో పాటు ఒక్కో కాలనీల్లోనూ 15 నుంచి 25 కుక్కల వరకు కలిసి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న వాహనదారులను వెంబడిస్తున్నాయి. శునకాలు గుంపుగా సంచరిస్తూ తమ మీదకి వస్తున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.