చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో... వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలోని బడికాయలపల్లి గ్రామంలోని... అంతర గంగమ్మ చెరువుకు గండి పడింది. తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి వద్ద హంద్రీనీవా కాలువ తెగిపోయింది. నీరంతా పంట పొలాల్లో ప్రవహిస్తోంది.
భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు - చిత్తూరు జిల్లా నేటి వార్తలు
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కాలువలకు గండి పడ్డాయి. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది.
భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
కంబాలపల్లి-మదనపల్లి మార్గంలో... భారీ వృక్షం కూలి రాకపోకలు స్తంభించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, మండల అధికారులు చెట్టును తొలగించారు. పెద్దమండ్యం సమీపంలోని ఉషావతి నది వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి.
ఇదీచదవండి.