ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వర్ల మొరాయింపుతో ఆగిన రిజిస్ట్రేషన్లు

సర్వర్లు మొరాయించడంతో గత రెండు రోజులుగా చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు ఎక్కడికక్కడ నిలిచాయి. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని భూ రిజిస్ట్రేషన్ కోసం వచ్చినవారు వాపోతున్నారు.

సర్వర్ల మోరాయింపుతో చంద్రగిరిలో ఆగిన రిజిస్ట్రేషన్లు
సర్వర్ల మోరాయింపుతో చంద్రగిరిలో ఆగిన రిజిస్ట్రేషన్లు

By

Published : Nov 10, 2020, 3:57 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత రెండు రోజులుగా సర్వర్లు పనిచేయక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు గత రెండు రోజులుగా పడిగాపులు కాస్తూ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వేచి ఉంటున్నారు. కార్యాలయ ఆవరణలో భూ లావాదేవీలు లేక వెలవెలబోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని భూరిజిస్ట్రేషన్ కు వచ్చినవారు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details