ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరి ఠాణాలో స్టీమ్ వేపరైజర్ పరికరం ఏర్పాటు - Chandragiri latest news

చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్​లో ఆవిరి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు పాటుపడుతున్న పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు స్థానిక సీఐ తెలిపారు.

Steam vaporizer device installed at Chandragiri base
చంద్రగిరి ఠాణాలో స్టీమ్ వేపరైజర్ పరికరం ఏర్పాటు

By

Published : May 6, 2021, 8:32 PM IST

తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాలతో చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్​లో స్టీమ్ వేపరైజర్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యం కల్పించినట్లు సీఐ రామచంద్రారెడ్డి తెలిపారు.

మరోవైపు.. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ... మహమ్మారి వ్యాప్తిని నియంత్రించాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details