ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్నికలు ముగియగానే.. విలేకరులకు కొత్త అక్రెడిటేషన్ల జారీకి కృషి'

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్​ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

State Press Academy Chairman Devireddy Srinath Reddy
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్​

By

Published : Feb 5, 2021, 12:10 PM IST

మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్​​ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనాంతరం సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం హంసలదీవి వేణుగోపాలస్వామిని దర్శించుకుని సాగర సంగమ ప్రాంతం, తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.

మోపిదేవిలో జర్నలిస్టులు తమ సమస్యలపై శ్రీనాథ్ రెడ్డికి వినతి పత్రం అందించారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక.. కొత్త అక్రెడిటేషన్​లు మంజూరు చేసేలా కృషి చేస్తానని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా విలేకరులకు.. పాసులు ఇచ్చే విధంగా సమాచార కమిషనర్​తో మాట్లాడతానని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details