చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం అన్నూరు పంచాయతీ నుంచి 1981లో నారాయణ స్వామి తొలిసారి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత మూడు రోజులకే కార్వేటి నగరం సమితి అధ్యక్షుడయ్యారు. అనంతరం సత్యవేడు ఎమ్మెల్యేగా ఓ సారి, గంగాధరనెల్లూరు నుంచి రెండుసార్లు గెలిచారు. తాను ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి అయినా సర్పంచి పదవే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటారు నారాయణస్వామి.
సర్పంచితో మెుదలు..ఉపముఖ్యమంత్రి వరకు
దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు..అలా...రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగిన నేతలైనా వారిలో కొందరికి గ్రామ పంచాయతీలే తొలిమెట్టు అవుతాయి. ఇలా పంచాయతీ సర్పంచిగా రాజకీయాల్లోకి ప్రవేశించి...తర్వాతి కాలంలో ఉన్నత పదవులు పొందినవారిలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఒకరు.
సర్పంచితో మెుదలు..ఉపముఖ్యమంత్రి వరకు