చిత్తూరు జిల్లాలో పర్యాటకులతో నిత్యం కలకలలాడే అంతర్జాతీయ స్థాయి ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్స్లీ హిల్స్‌లో తరచూ అసభ్యకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రక్షణ బాధ్యతలు చూడాల్సిన అటవీశాఖలో కొంతమంది చేస్తున్న అసభ్యకర ప్రవర్తనతో వచ్చేవారు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా హార్స్లీ హిల్స్‌కి వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుంటూ చేస్తున్న చేష్టలు వచ్చిపోయే వారికి విసుగు పుట్టిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవలె అటవీ శాఖకు ఫిర్యాదు అందగా విచారణ చేపట్టారు. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న అంతర్జాతీయ స్థాయి వేసవి విడిది, పర్యాటకుల కేంద్రంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అటవీ శాఖ, పర్యాటక శాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పర్యాటకులు.
హార్ల్సీ హిల్స్‌లో అసభ్యకర సంఘటనలు... - horsley hills
వేసవి విడిది..పర్యాటకుల కేంద్రమైన హార్ల్సీ హిల్స్‌లో అసభ్యకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమికులు కాసేపు సరదాగా మాట్లాడుకుందామని వస్తే వారినే టార్గెట్ చేసి దుష్టచర్యలు చేస్తున్నారు అక్కడి సిబ్బంది. దీనిపై పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు.
హార్ల్సీ హిల్స్ లో అసభ్యకర సంఘటనలు