ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్య గ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి దర్శనం రద్దు - solar eclipse on sunday news

సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు ఆదివారం దర్శనం ఉండదని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది.

Srivari's  visit cancellation on Sunday due to solar eclipse
తిరుమల శ్రీవారి ఆలయం

By

Published : Jun 20, 2020, 6:52 AM IST

సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు ఆదివారం దర్శనం ఉండదని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. అందువల్ల శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసి.. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెరుస్తారు. శ్రీవారికి రోజువారి కైంకర్యాలను జరిపి రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. కైంకర్యాల నిర్వహణలో భాగంగా భక్తులకు దర్శనం ఉండదు.

ABOUT THE AUTHOR

...view details