తిరుమలేశుని తెప్పోత్సవాలు ఐదురోజులపాటు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో ఆకరి రోజున శ్రీవారు అమ్మవార్లతో కలసి తిరుచ్చీ వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులై ఏడుమార్లు ప్రదక్షిణంగా విహరించారు. విశేష తిరువాభరణాలు, పరిమల భరిత పూలమాలలతో ఆళంకారభూషితులైన ఉత్సవమూర్తులను వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తి సంకీర్తనల నడుమ తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవాలు ముగియడంతో ఐదు రోజులపాటు రద్దు చేసిన ఆర్జితసేవలను పుణరుద్దరించారు.
తెప్పోత్సవం.. భక్తజన పరవశం - తిరుమలో శ్రీవారి తెప్పోత్సవం వార్తలు
తిరుమలో శ్రీవారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు తిరుచ్చీ వానంపై తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు.
Srivari Teppotsavam in Thirumala thirupathi in chittoor