ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 21న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత - tirumala temple taja news

సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈనెల 21న మూసివేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గ్రహణం రోజున దర్శనాలన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ ఆ రోజు తిరుమలకు రావొద్దని సూచించారు.

srivari temple will be colsed on this month 21 due to suryagrahanam
srivari temple will be colsed on this month 21 due to suryagrahanam

By

Published : Jun 15, 2020, 9:57 PM IST

ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. 20వ తేదీ రాత్రి ఏకాంతసేవ నిర్వహించి ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి 21న గ్రహణం పూర్తయిన తరువాత... మద్యాహ్నం రెండున్నర గంటలకు తెరవనున్నారు. 2.30 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవ‌ణం నిర్వహిస్తారు. గ్రహణం రోజున దర్శనాలన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details