TTD TICKETS RELEASE: డిసెంబర్ నెలకు తిరుమల సర్వదర్శనం టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో డిసెంబర్ నెల సర్వదర్శనం కోటా టికెట్లు అందుబాటులో ఉంచారు. రోజుకు పది వేల టికెట్ల చొప్పున రెండు లక్షలా 90 వేల టికెట్లను పది నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. వోటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లు కేటాయించడంతో.. ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు.
అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేస్తామన్నారు. డిసెంబర్‌కు సంబంధించిన కోటాను విడుదల చేస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.