చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం ఆనవాయితీ. ఈ నెల 14 నుంచి 22 వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అనంతరం పవిత్ర మిశ్రమాలతో ఆలయ సంప్రోక్షణం చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. తిరుపతికి చెందిన నరసింహులు అనే భక్తుడు రెండు పరదాలు, ఒక కురాళాన్ని విరాళంగా అందించారు.
శ్రీనివాసమంగాపురంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - శ్రీనివాసమంగాపురంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల తాజా న్యూస్
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈనెల 14 నుంచి 22 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
వైభవంగా శ్రీవారి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం