తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. స్వామివారి వాహన సేవల వివరాలు, తేదీలను శనివారం వెల్లడించింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి వాహనసేవలు జరుగుతాయని వివరించింది. గరుడ వాహన సేవను రాత్రి 7 గంటలకే ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 5న స్వామివారికి స్వర్ణ రథోత్సవం ప్రత్యేకంగా జరుగుతుందని తెలిపింది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధిలో భాగంగా సెప్టెంబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని, 29న ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని వివరించింది. 30న సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది.
సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు - సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్వామి వారి వాహన సేవల వివరాలను తితిదే వెల్లడించింది.
తిరుమల
వాహన సేవల వివరాలు
తేదీ | ఉదయం | రాత్రి |
30.9.2019 | ----- | పెద్దశేష వాహనం |
01.10.2019 | చిన్నశేష వాహనం | హంస వాహనం |
02.10.2019 | సింహ వాహనం | ముత్యపు పందిరి వాహనం |
03.10.2019 | కల్పవృక్ష వాహనం | సర్వ భూపాల వాహనం |
04.10.2019 | మోహినీ అవతారం | గరుడ వాహనం |
05.10.2019 | హనుమంత వాహనం | గజ వాహనం |
06.10.2019 | సూర్యప్రభ వాహనం | చంద్రప్రభ వాహనం |
07.10.2019 | రథోత్సవం | అశ్వ వాహనం |
08.10.2019 | చక్ర స్నానం | ధ్వజావరోహణం |
TAGGED:
tirumla