ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవాణి ట్రస్టు నూతన విధానానికి విశేష స్పందన - SRIVANITRUST_ONLINE_ HUGE RESPOND

భక్తులకు స్వామివారి దర్శనం కోసం... శ్రీవాణి ట్రస్టు నూతన విధానం ప్రవేశపెట్టింది. పదివేలు రూపాయలు చెల్లించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభించిన నెల రోజుల్లోనే విశేష స్పందన వస్తుందని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

శ్రీవాణి ట్రస్టు నూతన విధానానికి విశేష స్పందన

By

Published : Nov 5, 2019, 7:54 PM IST

శ్రీవాణి ట్రస్టు నూతన విధానానికి భక్తుల నుంచి విశేషస్పందన వస్తోందని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 10వేల రూపాయలు ట్రస్టుకు ఇచ్చే భక్తులకు ప్రోటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన విధానం ప్రారంభించిన నెలలో వెయ్యి మంది భక్తులు విరాళాలు సమర్పించినట్లు చెప్పారు. కరెంట్‌ బుకింగ్‌తో పాటు ఆన్‌లైన్‌ విధానంను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. శుక్రవారం 200 టిక్కెట్లు, మిగిలిన రోజుల్లో 500 టిక్కెట్లు ఈ ట్రస్టుకు కేటాయించామన్నారు. పర్వదినాలలో సైతం శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే దాతలకు దర్శనం కల్పిస్తామన్నారు.

శ్రీవాణి ట్రస్టు నూతన విధానానికి విశేషస్పందన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details