చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ముత్యపు పందిరి వాహనంపై విహరించిన స్వామి.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాఢ వీధుల్లో గజరాజు నడుస్తుండగా.. భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించి.. కర్పూర హారతులు సమర్పించారు.
శ్రీనివాసమంగాపురంలో వైభవంగా కళ్యాణ వెంకటేశుని బ్రహ్మోత్సవాలు - శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం ముత్యపు పందిరి వాహన సేవలో స్వామి వారు బకాసుర వధ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలు.. ముత్యపుపందిరిలో శ్రీవారి సేవ
Last Updated : Feb 26, 2020, 12:36 PM IST