చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. తిరుచ్చిపై కృష్ణుడు అభయమిచ్చారు. శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ.. ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.
మోహినీ అలంకారంలో శ్రీనివాసుడు...తిరుచ్చిపై కృష్ణుడు
చిత్తూరు జిల్లాలో శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు.. శ్రీనివాసుడు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. తిరుచ్చిపై కృష్ణుడు అభయమిచ్చారు
మోహినీ అలంకారంలో శ్రీనివాసుడు...తిరుచ్చిపై కృష్ణుడు
రాత్రి జరగనున్న గరుడ సేవలో స్వామివారికి అలంకరించేందుకు ఉదయం ఆండాళ్ అమ్మవారి మాలలను తీసుకెళ్లారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మాలలకు పూజలు చేసిన అనంతరం అర్చకులు వాహనంలో శ్రీనివాసమంగాపురానికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి