శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమలకు కుటుంబసమేతంగా విచ్చేశారు. వీఐపీ దర్శనం ప్రారంభ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు సిరిసేనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.
శ్రీవారి సేవలో శ్రీలంక అధ్యక్షుడు - JEO
తిరుమల శ్రీవారిని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి సేవకు హాజరయ్యారు.
శ్రీవారి సేవలో శ్రీలంక అధ్యక్షుడు