సూర్య, చంద్రగ్రహణాల సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. గ్రహణ సమయంలో రాహు కేతుల ప్రభావంతో దేవతల శక్తి సన్నగిల్లుతుందని భావించి ఇలా చేస్తారు. కానీ.. శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవగ్రహ కవచం ఉంది. ఈ కారణంగా.. గ్రహణం ఏర్పడినా ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు. అందుకే గ్రహణం సమయంలోనూ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇదొక్కటే కాదు.. గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే సమస్యలు తీరుతాయని... కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగానే గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేసేందుకు భక్తులు తరలి వస్తారు. ఇవాల్టి సంపూర్ణ సూర్య గ్రహణ సందర్భంగానూ.. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. రాహు కేతు పూజలు చేశారు.
గ్రహణం వేళ.. శ్రీకాళహస్తీశ్వరుడికి భక్తుల పూజలు - srikalashasti pujas during solar eclipse news
సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా.. దేశంలోని ఇతర ఆలయాలన్నీ మూసి ఉన్నా... చిత్తూరు జిల్లా కాళహస్తిలో మాత్రం ఆలయం తెరిచే ఉంది. ఏ గ్రహణమైనా.. ఇక్కడ ఆలయాన్ని మూయరు. ఇవాళ కూడా తెరిచే ఉంచారు. వేలాదిగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.
గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు