కనుమ పండుగను పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవారులు ఘనంగా కైలాసగిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ అలంకార మండపంలో బయలుదేరిన ఆది దంపతులు ఉత్సవంగా 18 కిలోమీటర్లు కైలాసగిరి ప్రదక్షిణ చేశారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని.. అడుగడుగున స్వామి అమ్మవార్లకు భక్త జనం ఘనస్వాగతం పలికి, హారతులు పట్టారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్ల వెంట నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు.
వైభవంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయ కైలాస గిరి ప్రదక్షిణ - Srikalahastishwara Temple giri prashakshinam news update
వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ కాదేవి శ్రీకాళహస్తీశ్వర ఆలయ కైలాస గిరి ప్రదక్షిణ చేశారు. కనుమ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఉత్సవానికి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు.
వైభవంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయ కైలాస గిరి ప్రదక్షిణ
ఇవీ చూడండి...