చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నూతనంగా విధుల్లో చేరిన ఓ అర్చకుడు చేసిన అర్చన వివాదానికి దారితీసింది. అర్చకుడు నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి పానవట్టంపై అభిషేకం చేయడంతో ఇతర అర్చకులు అభ్యంతరం తెలిపారు. భరద్వాజ వంశస్థులలో శివ దీక్ష తీసుకున్న వారు మాత్రమే అభిషేకం చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ విరుద్ధంగా ప్రవర్తించారని శాప్ మాజీ ఛైర్మన్ పి.ఆర్.మోహన్ ఆరోపించారు. ఆలయం ఎదుట భిక్షాల గోపురం వద్ద నిరసన తెలిపారు. దేవాదాయ శాఖ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అభిషేకం విషయంలో శ్రీకాళహస్తి అర్చకుల మధ్య వివాదం - శ్రీకాళహస్తి వార్తలు
శ్రీకాళహస్తి దేవస్థానంలో నూతనంగా విధుల్లో చేరిన ఓ అర్చకుడు అభిషేకం నిర్వహించడంపై ఇతర అర్చకులు అభ్యంతరం తెలిపారు. శివ దీక్ష భరద్వాజ వంశస్థులు మాత్రమే అభిషేకం చేయాలని...నిబంధనలకు విరుద్ధంగా నూతన అర్చకుడు వ్యవహరించాలని శాప్ మాజీ ఛైర్మన్ మోహన్ ఆరోపించారు.

అభిషేకం విషయంలో శ్రీకాళహస్తి అర్చకుల మధ్య వివాదం