చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ మాఢవీధులు ఆరెంజ్ జోన్ లోకి రావడంతో... దర్శనానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం వేకువజామున స్వామి, అమ్మవారికి శాంతి అభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
శ్రీకాళహస్తి ఆలయంలోకి ఈనెల 11 నుంచి భక్తులకు అనుమతి - చిత్తూరు శ్రీ కాళహస్తీశ్వరాలయం వార్తలు
శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం సాయంత్రం నుంచి సిబ్బందితో ట్రైల్ రన్ నిర్వహించనున్నారు. ఆలయంలో భక్తుల దర్శనానికి ప్రభుత్వం అనుమతించడంతో... ఈనెల 11వ తేదీన స్థానికులకు, 12 నుంచి భక్తులందరకి దర్శనం కల్పించనున్నట్టు ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం ఆలయ సిబ్బందితో ట్రైల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 11వ తేదీన స్థానికులకు, 12 నుంచి భక్తులందరకి దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు. గంటకు 300 నుంచి 500 మంది భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు చెపట్టామన్నారు. గంటకు 300 మంది జంటలకు మాత్రమే రాహూ, కేతు పూజలు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకుని రావాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. భక్తులు ఒక్కొక్కరూ 6 అడుగుల దూరం పాటించేలా చర్యలు చేపడుతామని తెలిపారు.
ఇదీ చదవండి:పేస్ట్ అనుకుని బ్రష్ చేసిన గర్భిణీ... చివరకు