శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీల లెక్కింపు ద్వారా ఆలయానికి కోటికి పైగా ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ఈవో డి. పెద్దిరాజు వెల్లడించారు. ముక్కంటి ఆలయ ఆవరణలోని శ్రీమేథో దక్షిణమూర్తి సన్నిధి వద్ద బుధవారం హుండీలను లెక్కించారు. 35 రోజులకు గాను కోటి 23 లక్షల 55 వేల 809 రూపాయల ఆదాయం, 73 గ్రాములు బంగారం, 452 కేజీల వెండి వచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు 60 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు వివరించారు.
35 రోజులు.. రూ.1.23 కోట్లు - srikalahastiswara temple hundi counting update
కరోనా నిబంధనల ఆంక్షల సడలింపులతో తెరుచున్న ఆలయాలకు.. క్రమంగా హుండీల ద్వారా ఆదాయం పెరుగుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీలను లెక్కించగా.. కోటి 23 లక్షల 55 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం హుండీల లెక్కింపు