ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణ చర్యలకు ఆమోదం - శ్రీకాళహస్తి ఆలయం తాజా వార్తలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీల నియంత్రణకు ఆలయ అధికారులు ఆమోదం తెలిపారు. గుడికి విద్యుద్దీపాలు అమర్చడం, చినుకులు పడడాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

srikalahasti temple
శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణకు ఆలయ అధికారుల ఆమోదం

By

Published : Nov 22, 2020, 12:16 PM IST

పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణకు ఆలయ అధికారులు ఆమోదం తెలిపారు. చినుకు పడితే చిత్తడిగా మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లీకేజీ నియంత్రణకు అయ్యే ఖర్చును తమిళనాడులోని కోయంబత్తూర్ లక్ష్మీ మిల్స్ నిర్వాహకులు భరించేందుకు ముందుకు వచ్చారు.

ఈ చర్యలకు రూ. 1.5 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ విషయమై సంస్థ ప్రతినిథులతో ఆలయ ఈవో పెద్దిరాజు, ఈఈ వెంకటనారాయణ సమావేశమమయ్యారు. రాతిస్తంభాలు, శిల్పాలు స్పష్టంగా కనిపించేలా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details