ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భయం గుప్పిట్లో శ్రీకాళహస్తి ఉప ఖజానా కార్యాలయ సిబ్బంది - శ్రీకాళహస్తి ఉప ఖజానా కార్యాలయం వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఉప ఖజానా కార్యాలయం అధ్వాన్నంగా మారింది. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం సైతం అందుబాటులో లేకపోవటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధులున్నా నూతన కార్యాలయం నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శిధిలావస్థకు చేరుకున్న భవనంలోనే.. ఉద్యోగులు భయపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు.

srikalahasti sub treasury office damage
శ్రీకాళహస్తి ఉప ఖజానా కార్యాలయం

By

Published : Sep 29, 2020, 2:19 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం ఉప ఖజానా కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. చిన్నపాటి వర్షానికి సైతం.. నీరు లోపలికి వస్తుండటంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భవనం నూతన ఫించన్లు, ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. కార్యాలయానికి వచ్చే వృద్ధులు కూర్చునేందుకు సైతం వీలు లేకపోవటంతో ఇబ్బందులు తప్పటం లేదు. నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం 95 లక్షల రూపాయల మేర నిధులు సమకూర్చినా.. పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. దీనివల్ల శిథిలమైన భవనంలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై శ్రీకాళహస్తి ఖజానా కార్యాలయం అధికారి సెల్వ కుమార్ మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details