శ్రీకాళహస్తిని మరో 28 రోజులు రెడ్‌జోన్‌గా కొనసాగిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా వెల్లడించారు. పట్టణంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావటంతో శ్రీకాళహస్తికి చేరుకున్న కలెక్టర్, పురపాలకశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, రసాయనాల పిచికారి వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. క్వారంటైన్లో ఉంచిన వారికే కరోనా పాజిటివ్‌గా రావటంతో కొంతమేర వ్యాప్తి తీవ్రత తగ్గుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు ఇంటివద్దకే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు.
మరో 28 రోజులు శ్రీకాళహస్తి రెడ్జోనే: చిత్తూరు కలెక్టర్ - శ్రీకాళహస్తి రెడ్‌జోన్ కాలం పొడిగింపు
శ్రీకాళహస్తిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మరో 28 రోజులపాటు శ్రీకాళహస్తిని రెడ్‌జోన్‌గా కొనసాగించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి, తమకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
శ్రీకాళహస్తిలో రెడ్‌జోన్ గడువు పెంపు