రాష్ట్రంలో నివర్ తుపాను ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంకా నీటిలోనే ప్రజలు ఉన్నారు. ఈ సమస్యల నుంచి తేరుకోకముందే బురేవి తుపాన్ ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది.
'బురేవి తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటాం' - burevi cyclone news
నివర్ తుపాన్ ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే బురేవి తుపాను ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాళహస్తి ఏఎస్పీ అరిపుల్లా తెలిపారు.
ఏఎస్పీ అరిపుల్లా
ఈ విషయమై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో పోలీసులతో ఏఎస్పీ అరిపుల్లా సమావేశం నిర్వహించారు. రాబోయే బురేవి తుపానును సమర్థంగా ఎదుర్కొంటామని తెలిపారు. తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. 23 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: