ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శనాలు పునఃప్రారంభం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలకు నేటి నుంచి అధికారులు అనుమతించారు. ఎన్నో అడ్డంకులు తరువాత ఎట్టకేలకు ఆలయం పునఃప్రారంభమైంది. సామాజిక దూరం పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

srikalahasthi temple reopend in chithoor dst
srikalahasthi temple reopend in chithoor dst

By

Published : Jun 16, 2020, 4:52 PM IST

Updated : Jun 16, 2020, 5:20 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా మార్చి 20 నుంచి ముక్కంటి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8వ తేదీన అన్ని దేవాలయాల్లో భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఆ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండటంతో దర్శనాలకు అనుమతించలేదు.

ఈనెల 11వ తేదీన మళ్లీ దర్శనాలు ప్రారంభించాలని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆలయ అర్చకునికి కరోనా పాజిటివ్ రావటంతో తిరిగి వాయిదా పడింది. సుమారు 86 రోజులు తర్వాత దేవాదాయశాఖ ఆదేశాలతో నేటి నుంచి దర్శనాలు ప్రారంభించారు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం కల్పించేలా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. రాహుకేతు పూజలు యధావిధిగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇదీ చూడండిఇకపై కాగిత రహిత కార్యాలయాలు

Last Updated : Jun 16, 2020, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details