చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన ఘటనలో నలుగురు ఆలయ ఉద్యోగులను సస్పెన్షన్ చేస్తూ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఆలయంలోపల కాశీ, రామేశ్వరం విగ్రాహాలు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు అనధికారికంగా శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను ఏర్పాటు చేయడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి.
అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన ఘటనలో నలుగురు ఉద్యోగులు సస్పెండ్ - శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉద్యోగులు సస్పెండ్
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన ఘటనలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి జారీ చేశారు.

srikalahasthi temple
ఈ క్రమంలోనే పోలీస్ ప్రత్యేక బృందం ఆలయంలో సీసీ ఫుటేజీలను పరిశీలించి ఈ నెల 6న తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినదుకు ప్రధాన అర్చకులు గురుకుల్, భద్రతా విభాగం ఏఈవో ధనపాల్, ఇన్స్పెక్టర్ లు సారధి, వెంకటమునిలను సస్పెన్షన్ చేస్తూ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
ఇదీ చదవండి:అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపి: సీఎం జగన్