చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి మరో కొత్త పరిశ్రమ వరించింది. ఇనగలూరులో 700కోట్లుతో పెట్టుబడి పెట్టేందుకు అపాచీ పుట్ వేర్ సంస్థ సిద్దమైనది. ఇంటలిజెంట్ సెజ్(పుట్ వేర్ ఉత్పతి) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమ స్థాపించనున్నారు. ఇనగలూరు పరిధిలో సుమారు 300 ఎకరాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఇప్పటికే జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చాయి. దీనికి అనుగుణంగా ఆ ప్రాంత పరిధిలో భూ సేకరణ పూర్తిచేసి అందుబాటులో ఉంచారు. తాజాగా ప్రభుత్వం ఇక్కడ అపాచీ ఫుట్ వేర్ సంస్థ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. పరిశ్రమతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
శ్రీకాళహస్తిలో అపాచీ ఫుట్ వేర్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం - Apache Footwear Company news
శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ పుట్వేర్ సంస్థ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకు 7వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు రానున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీకాళహస్తిలో అపాచీ ఫుట్ వేర్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం
ఇవీ చదవండి