కొవిడ్ నిబంధనల్లో భాగంగా మూసివేసిన శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ఈ రోజు నుంచి పునఃప్రారంభమైంది. సందర్శకులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని క్యూరేటర్ హిమశైలజా అన్నారు . ఆన్లైన్ బుకింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. మాస్కులు,శానిటేషన్, భౌతిక దూరం పాటించాలని సందర్శకులకు సూచించారు. అలాగే ఎంట్రన్స్ లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి సందర్శకులను అనుమతిస్తున్నామని చెప్పారు.
దాదాపు 7 నెలల తర్వాత జూ పార్కు ప్రారంభమవ్వటంతో సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపారు. థియేటర్లు, పార్కులు వంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలు లాక్ డౌన్ కారణంగా మూతపడడంతో విసిగిపోయామని... జూ పార్కు తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని సందర్శకులు అన్నారు. అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.