తిరుపతి శ్రీకోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరిపారు. వేడుకల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం నవమి ఆస్థానం నిర్వహించారు. రాత్రికి స్వామి వారి ప్రియభక్తుడైన హనుమంత వాహనంపై రాముల వారిని వేంచేపు చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఉత్సవాలన్నీ ఆలయంలో ఏకాతంగా జరగనున్నాయి.
కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి
శ్రీరామ నవమి వేడుకలను తిరుపతి కోదండరామ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనల దృష్ట్యా నేడు జరగనున్న ఉత్సవాలన్నీ ఏకాంతంగానే జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీరామ నవమి