చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం అమ్మవారు రథంపై విహరించారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలను ఆలయం వద్ద ఉన్న వాహన మండపంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న చెక్క రథంపై రథోత్సవాన్ని నిర్వహించారు.
వైభవంగా పద్మావతీ అమ్మవారి రథోత్సవం - తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం వార్తలు
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో రథాన్ని లాగారు. తితిదే జీయర్‌స్వాములు, చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జెఈవో బసంత్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం