తితిదేకి అనుబంధంగా ఉన్న.. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి రూ.45 లక్షలు విలువైన కిలో బంగారు వడ్డాణం కానుకగా లభించింది. విశాఖపట్నానికి చెందిన ఎకో కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.కాళిదాస్, మేనేజింగ్ డైరెక్టర్ డా.భానుమతి దాస్ ఈ కానుకను అందించారు. స్వామివారి మూలవిరాట్టుకి ఈ వడ్డాణాన్ని అలంకరిస్తారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎల్లప్ప, ప్రధానార్చకులు బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ వెంకటేశ్వరస్వామికి భారీ విరాళం - శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్తలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రూ.45 లక్షలు విలువైన బంగారు వడ్డాణం కానుకగా అందింది. విశాఖపట్నానికి చెందిన ఎకో కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళాన్ని అందించింది.
Sri Kalyana Venkateswaraswamy temple in Srinivasamangapuram has been awarded as a gift of one kilo gold worth Rs.45 laks in chittoor