ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీనివాస మంగాపురంలో.. 13 నుంచి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు - Salakatla sakkhatkara vaibhavostavalu

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జులై 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఈ ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. అనావాయితీ ప్రకారం రేపు స్వామి వారికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

Sri Kalyana Venkateswara Swamy temple
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం

By

Published : Jul 7, 2021, 7:40 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జులై 13 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రోజుల వారీగా స్వామి వారి దర్శనం..

  • మొదటి రోజు రాత్రి 6 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారి దర్శనం
  • రెండవరోజు హనుమంత వాహనంపై స్వామి వారి దర్శనం
  • మూడవరోజు గరుడవాహనంపై స్వామి వారి దర్శనం
  • చివరగా జూలై 16వ తేదీన పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం రేపు ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగనుంది. కొవిడ్ దృష్ట్యా ఈ కార్యక్రమాలన్ని ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే పేర్కొంది.

ఇదీ చదవండి:

TTD: తితిదే బోర్డును త్వరలో ప్రకటిస్తాం: మంత్రి వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details