చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సర్వభూపాల వాహనసేవ జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గజరాజులు, భక్తుల చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా.. వాహనసేవ కోలాహలంగా సాగింది. నాలుగు మాఢ వీధుల్లోని భక్తులు కర్పూర హారతులతో స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతి దాయకమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.
సర్వభూపాల వాహనంపై శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి - శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
సర్వభూపాల వాహనంపై శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి