ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయ కళ.... శిల్పాలతో ఉట్టిపడుతోందిలా! - తంబళ్లపల్లిలో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వార్తలు

ములకలచెరువు మండలం సోంపల్లె వద్ద వెలసిన శ్రీచెన్నకేశవస్వామి ఆలయం... శిల్పకళతో ఉట్టుపడుతోంది. క్రీ.శ. 1400 - 1600 మధ్య నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు.. ఇప్పటికీ పర్యటకుల మది దోస్తున్నాయి.

ఆలయ కళ.... శిల్పాలతో ఉట్టిపడుతుందిలా!
ఆలయ కళ.... శిల్పాలతో ఉట్టిపడుతుందిలా!

By

Published : Dec 17, 2019, 4:06 PM IST

ఆలయ కళ.... శిల్పాలతో ఉట్టిపడుతుందిలా!

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువు మండల పరిధిలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ సముదాయం శిల్పకళతో విరాజిల్లుతోంది. క్రీస్తు శకం 1400 - 1600 సంవత్సరాల మధ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో సామంతరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు.ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో వేల శిల్పాలు దర్శనమిస్తున్నాయి.

ప్రత్యేకతలు

  • అమర శిల్పి జక్కన్నచారుల శిష్యులు ఇక్కడి రాళ్లపై అపురూపమైన శిల్పాలు చెక్కారు.
  • ఆలయం ముందు భాగంలో 70 అడుగులకు పైగా ఉన్న ఏకశిలా రాతి స్తంభం
  • రాతి స్తంభం మొదటి భాగంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు అన్నమాచార్యులు, తుంబుర స్వామి, తరిగొండ వెంగమాంబ, గరుడ శిల్పాలున్నాయి.
  • స్వామివారి కళ్యాణ మండపంలో శిల్ప కళా సౌందర్యం ఉట్టిపడుతుంది.
  • ఆలయం వెలుపల భాగంలో అప్పటి పాలకులు దోషులకు ఉరి తీసేందుకు ఏర్పాటుచేసిన ధర్మ గంట, నాలుగు స్తంభాల ఉరి కొయ్యలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.
  • అప్పటి పెద్దలు తీర్పు చెప్పడానికి ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానం.యుద్ధాలలో పోరాడి ప్రాణాలు అర్పించిన మహిళా సైనికులు, సైనికాధికారుల శిల్పాలున్నాయి.

పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చినప్పటినుంచి ఈ ఆలయాన్ని అంచలంచలుగా అభివృద్ధి చేస్తున్నారు. నిత్యం వివిధ జిల్లాల పర్యటకులు, దేశవిదేశీ సందర్శకులు ఇక్కడికి వచ్చి సందడి చేస్తుంటారు. వీరికి అన్ని వసతులతో కూడిన వసతి సముదాయాలను తగినన్ని నిర్మించాలని, ఈ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని నిర్మించి ప్రజాదరణ పొందే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ఆపదలో ఉంటే వస్తారు... చేయూతనిస్తారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details