చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. యర్రావారిపాళెం మండలంలో 3, చిన్నగొట్టిగల్లులో 1, చంద్రగిరి మండలంలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసులతో నియోజకవర్గంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ... భయం గుప్పిట్లో స్థానికులు - చిత్తూరు జిల్లా నేటి వార్తలు
చిత్తూరు జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి, రాకపోకలను నిషేధించారు.
వైరస్ వ్యాప్తి నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
ఈ ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో పాటు.. ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్, రసాయన ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో నివసించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని ఆదేశించారు. ఈ ప్రాంతాలలో కొత్తవారు ఎవరూ రాకుండా చూడాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు.
ఇదీచదవండి.