చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి పూజలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 3 నెలల తర్వాత దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నందున.. స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి పూజలు - శ్రీకాళహస్తి దేవాలయం
కరోనా కారణంగా దాదాపు 3 నెలలుగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పండితులు శాంతి పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి పూజలు