కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోన్న తరుణంలో చైనా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో రాష్ట్ర అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ, రేణిగుంటలోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు చైనీయులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మూడు రోజుల క్రితమే చైనా నుంచి వచ్చిన వీరికి బెంగళూరు విమాశ్రయంలో పరీక్షలు నిర్వహించారు. వైరస్ లేదని నిర్ధరించుకున్న తర్వాతే 15 మందిని నగరంలోకి అనుమతిచ్చారు.
రేణిగుంట చేరుకున్న చైనీయులకు వైద్య పరీక్షలు - ap karouna varius news
కరోనా వైరస్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిని నివారించేందుకు... ఇప్పటికే చైనా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు చేయిస్తోంది.
'రేణిగుంట చేరుకున్న చైనీయులకు ప్రత్యేక పరీక్షలు'