శేషాచల అడవుల్లో టాస్క్ఫోర్స్ నిరంతర కూంబింగ్ కొనసాగుతుండగా.. ఈ రోజు ఉదయం చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అటవీశాఖ, పోలీసులు, ప్రత్యేక కార్యదళం (టాస్క్ ఫోర్స్) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటిని నిలువరించలేకపోతున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవుల్లో అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో కొంతమంది ఎర్రచందనం దుంగలతో టాస్క్ ఫోర్స్ అధికారులకు తారసపడ్డారు. అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.