ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు, కడపలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టు - coombing at seshachalam forest

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులలో పోలీసు ప్రత్యేక దళం కూంబింగ్ నిర్వహించింది. తిరుపతికి చెందిన కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. స్మగ్లర్ల నుంచి 12 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శేషాచలం అడవులలో కూంబింగ్ నిర్వహించిన ప్రత్యేక దళం

By

Published : Oct 9, 2019, 8:28 PM IST

శేషాచలం అడవులలో కూంబింగ్ నిర్వహించిన ప్రత్యేక దళం

చిత్తూరు జిల్లా తిరుపతిలోని శేషాచలం కల్యాణి డ్యాం పరిసర ప్రాంతాలలో పోలీసుల ప్రత్యేక దళం కూంబింగ్ నిర్వహించింది. తిరుపతికి చెందిన కొంతమంది స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం అందటంతో వారు రాగిమాకులకుంట వద్ద మాటు వేశారు. ఇద్దరు స్మగ్లర్లు ఆటోలో ఎర్రచందనం దుంగలు వేస్తుండగా టాస్క్​ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టారు. స్మగ్లర్ల నుంచి 12 ఎర్రచందనం దుంగలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

కడప జిల్లాలోని చిట్వేలు మండలంలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లారీలో ఎర్రచందనాన్ని తరలించేందుకు యత్నిస్తుండగా అధికారులు దాడులు చేశారు. అధికారులను చూసి స్మగ్లర్లు పరారు కాగా.. 21ఎర్రచందనం దుంగలు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: శశికళ ఉన్న జైలులో భారీగా ఆయుధాలు, గంజాయి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details