ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొన్ని మిగిల్చి.. మరికొన్ని దోచుకెళ్లి - తిరుపతిలో కొన్ని నగలనే దొచుకెళ్లిన దొంగ

దొంగతనం అంటేనే అందినకాడికి దోచుకెళ్లడం. దీనికి భిన్నంగా తిరుపతి నగరంలో ఓ చోరీ జరిగింది. బీరువా తెరిచి కొన్ని ఆభరణాలు అపహరించుకుపోయారు. ఇందులోనే మరికొన్ని వస్తువులున్నా వదిలేసి వెళ్లారు.

Theft
దొంగతనం

By

Published : May 24, 2021, 12:17 PM IST

తిరుపతి శ్రీనగర్‌ కాలనీకి చెందిన అచ్యుత్‌ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. యువకుడి తాతకు ఆరోగ్యం బాగోలేదని ఫోన్‌ రావడంతో ఈనెల 4న కుటుంబ సభ్యులంతా కలిసి గుంటూరు జిల్లా మంగళగిరికి వెళ్లారు. మూడు రోజుల తర్వాత వృద్ధుడు మృతి చెందడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఆదివారం సాయంత్రం అచ్యుత్‌ ఒక్కడే తిరుపతికి వచ్చాడు. ఇంటికి దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న తలుపులు పగలగొట్టి ఉన్నట్లు గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని 112 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. అదే బీరువాలో నాలుగు సవర్ల చైను, నల్లపూసల దండ, ఐదు ఉంగరాలు, కమ్మలు, నాలుగు గాజులు, ఒక డాలర్‌తోపాటు వెండి వస్తువులు భద్రంగా ఉన్నాయి.

యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌, ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది.

ఇదీ చదవండీ..కరోనా మృతుల్లో.. 65% పురుషులే..!

ABOUT THE AUTHOR

...view details