తితిదే అనుబంధ ఆలయం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. శ్రావణమాసంలో చివరి శుక్రవారం కావటంతో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. లక్ష కుంకుమార్చనలో భాగంగా ఆలయం మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చారు. కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. అనంతరం లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. కరోనా నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
కపిలేశ్వరస్వామివారి ఆలయంలో లక్ష కుంకుమార్చన - ఆలయంలో శ్రావణమాస చివరి శుక్రవారం ప్రత్యేక పూజలు
తితిదే అనుబంధ ఆలయం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. శ్రావణమాసంలో చివరి శుక్రవారం కావటంతో ప్రత్యేక పూజలు చేశారు.
కపిలేశ్వరస్వామివారి ఆలయంలో లక్ష కుంకుమార్చన