తరతరాలుగా వస్తున్న ఆచారన్ని అనుసరించి...కపిలతీర్ధం పైభాగాన పూజలు నిర్వహించారు తిరుపతిలోని గాండ్ల కులస్థులు. కార్తీకపౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున కపిలతీర్ధం పైభాగాన ఉన్న దీపాన్ని వెలిగించి పూజలు చేయడం... వారికి తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. శివ నామస్మరణ చేస్తూ శిఖరంపై ఉన్న కార్తీక దీపాన్ని వెలిగించి...భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ దీపాన్ని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.
కపిలతీర్థంలో గాండ్ల కులస్థుల ప్రత్యేక పూజలు - కపిలతీర్థం వార్తలు
కార్తీకపౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గాండ్ల కులస్థులు కపిలతీర్థంపై ఉన్న దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
కపిలతీర్థంలో గాండ్ల కులస్థుల ప్రత్యేక పూజలు