ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తిలో సర్వేశ్వరునికి సంప్రోక్షణ - శ్రీకాళహస్తిలో సర్వేశ్వరునికి సంప్రోక్షణ

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పొరుగు సేవల కింద పనిచేసే అర్చకుడు నిబంధనలకు విరుద్ధంగా స్వామివారికి అభిషేకం చేయడంపై గత కొద్ది రోజులుగా అర్చకుల మధ్య వివాదం జరుగుతుంది. ఇందులో భాగంగానే అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.

special pooja
special pooja

By

Published : Jul 7, 2020, 10:04 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద యాగకలశాలను ఏర్పాటు చేశారు. ఆలయంలో పొరుగుసేవక అర్చకునిగా పనిచేస్తున్న నాగరాజు ఇటీవల ముక్కంటి ఆలయ శివలింగాన్ని స్పృశించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జరిగిన అపచారానికి నివృత్తిగా సంప్రోక్షణకు ఆలయ అధికారులు, అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి వేర్వేరుగా యాగకలశాలను ఏర్పాటు చేసి సంకల్ప పూజలను ప్రారంభించారు. యాగ కలశాలను ఉద్వాసన చేసి ఆలయంలో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని మూలమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details