దేశ రాజధాని దిల్లీ వాసుల పాల అవసరాలను తీర్చేందుకు... చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి మరో ప్రత్యేక గూడ్స్ రైలు బయల్దేరింది. జిల్లా నుంచి సేకరించిన పాలను దిల్లీకి ఈ రైలు ద్వారా తరలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆరు ట్యాంకర్లతో 2లక్షల 40వేల లీటర్ల పాలను దేశ రాజధానికి పంపించారు. లాక్డౌన్ నుంచి ఇప్పటివరకూ 42 ట్రిప్పులు నడపగా... నేటి సర్వీసుతో ఈ లక్ష్యం కోటి 4లక్షల లీటర్లను పూర్తి చేసుకున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
రేణిగుంట నుంచి దిల్లీకి.. బయల్దేరిన ప్రత్యేక పాల గూడ్స్ రైలు
లాక్డౌన్ సమయంలో దేశ రాజధాని వాసులకు చిత్తూరు జిల్లా ఆసరా అవుతోంది. ఎలా అంటారా..? జిల్లా నుంచి సేకరించిన పాలను దిల్లీ వాసుల అవసరాలు తీర్చేందుకు అధికారులు పంపిస్తున్నారు. గురువారం 2లక్షల 40వేల లీటర్ల పాలతో ప్రత్యేక గూడ్స్ రైలు హస్తినాపురానికి బయలుదేరింది.
రేణిగుంట నుంచి దిల్లీకి బయల్దేరిన ప్రత్యేక పాల గూడ్స్ రైలు