ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు - news updates in thirumala

రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలవుతున్న పరిస్థితుల్లో.. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.

special arrangements for Devotees of thirumala
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

By

Published : May 5, 2021, 7:28 PM IST

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతికి చేరుకున్న భక్తులను ఎలాంటి ఆంక్షలు విధించకుండా కనుమ దారుల్లో కొండపైకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. యాత్రికుల సౌకర్యార్థం తిరుమల - తిరుపతి మధ్య అర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు.

తిరుచానూరు ఆలయంతో పాటూ తితిదే ఆధ్వర్యంలోని ఇతర ఆలయాలలో దర్శన సమయాన్ని కుదించిన తితిదే.... తిరుమలలో అన్ని రకాల కొవిడ్‌ నియమాలను పాటిస్తూ స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details